Home న్యూస్ కాంతార రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

కాంతార రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

0

కన్నడ వర్షన్ కాంతార రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయ్యి ఊహించిన దానికన్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా కి ఇతర భాషల్లో కూడా డిమాండ్ ఏర్పడగా రీసెంట్ గా సినిమాను మిగిలిన భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగా తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే అపార సంపద ఉన్న ఓ రాజు లైఫ్ లో ఇంకా ఎదో వెలితి ఉంది అని వెతుకులాటలో ఉండగా అడవిలో ఓ దేవుని ప్రతిమ కనిపిస్తుంది, ఆ ప్రతిమని తనకి ఇస్తే ఆ అడవి సంపద మొత్తం అక్కడి ప్రజలకు ఇస్తానని దేవుడు ఆవహించిన మనిషికి మాట ఇస్తాడు, కానీ తర్వాత మాట తప్పుతాడు, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ పాయింట్…

హీరో కం డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి యూనిక్ స్టొరీ పాయింట్ ని కంప్లీట్ రా రగ్గుడ్ నేపధ్యంలో తెరకిక్కించగా తన పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా మిగిలిన యాక్టర్స్ అందరూ ఆకట్టుకున్నారు, సినిమా మొదటి పావుగంట అలాగే చివరి 30 నిమిషాలు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్…

అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా మెప్పించగా సినిమాలో సౌండింగ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెస్మరైజ్ చేయడం ఖాయం, సినిమాలో వచ్చే లవ్ స్టొరీ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా ముందే చెప్పినట్లు ఇంట్రో ఇంటర్వెల్ అండ్ ఎండింగ్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలిగించి సినిమా ఎండ్ అయ్యాక కూడా మనతో కొద్ది సేపు ట్రావెల్ అవుతుంది….

ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీస్ ని రా రగ్గుడ్ కంటెంట్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతుంది, రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా ఈ సినిమా కి వెళ్ళొచ్చు, కొంచం అక్కడక్కడా బోర్ అనిపించే సీన్స్ ని బరిస్తే ఓ అద్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలగడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here