బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాలు అన్నీ బుల్లితెర పై టెలికాస్ట్ అయినప్పుడు TRP రేటింగ్ కూడా అదే రేంజ్ లో సాధించాలి అన్న రూల్ లేదు కానీ చాలా వరకు సినిమా లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయితే ఆటోమాటిక్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు అద్బుతమైన TRP రేటింగ్ ని సాధిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడో అరకొరగా కొన్ని సినిమాలు మాత్రం…
TRP రేటింగ్ పరంగా టెలివిజన్ లో అంచనాలు తప్పుతాయి. లాస్ట్ ఇయర్ దీపావళి కి కార్తి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా ఎంత సైలెంట్ గా రిలీజ్ అయ్యిందో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊరమాస్ అనిపించే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.
సినిమా తెలుగులో 5 కోట్ల టార్గెట్ కి ఏకంగా 8.55 కోట్ల షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ అనిపించుకోగా మంచి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి స్టార్ మా చానెల్ సినిమా శాటిలైట్ రైట్స్ ని కొన్నారు. కానీ చాలా ఆలస్యంగా సినిమా ను రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు. అయినా కానీ TRP రేటింగ్ బాగుంటుంది అనుకుంటే…
సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు షాకింగ్ గా 4.11 TRP రేటింగ్ మాత్రమే దక్కింది. ఇది లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లోకి లోవెస్ట్ TRP రేటింగ్ అవ్వడం మరింత షాకింగ్ గా మారింది అని చెప్పాలి. సినిమా లో ఉన్న మాస్ కంటెంట్ వలనా అలాగే ఎక్కువ శాతం సినిమా నైట్ లోనే ఉండటం లాంటివి…
ఎదురు దెబ్బ తీసి ఉంటాయని అంటున్నారు. కారణాలు ఏవి అయినా కానీ కార్తికి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో సినిమా కి కొంచం బెటర్ TRP రేటింగ్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు. కానీ ఈ రేటింగ్ రావడం మాత్రం అందరికీ షాకింగ్ గానే ఉందని చెప్పాలి.