Home TRP రేటింగ్ అక్కడా డిసాస్టరే…..ఇక్కడా డిసాస్టరే…NGK షాకింగ్ TRP

అక్కడా డిసాస్టరే…..ఇక్కడా డిసాస్టరే…NGK షాకింగ్ TRP

453
0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, ఒక టైం లో తెలుగు లో స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేసిన సూర్య ఆడియన్స్ అంచనాలను అందుకునే రేంజ్ సినిమా లు చేయడం లో విఫలం అవ్వడం తో తన మార్కెట్ ని కోల్పోతూ వచ్చాడు కానీ మంచి సినిమా పడితే కచ్చితంగా తన సత్తా చూపగలడు.

సూర్య నటించిన లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అంచనాలను తప్పాయి. తమిళ్ అలాగే తెలుగు రెండు చోట్లా కూడా అంచనాలను తప్పిన సినిమాల్లో NGK సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి.

తెలుగు తమిళ్ కలిపి ఆల్ మోస్ట్ 78 కోట్ల బిజినెస్ చేయగా సినిమా టోటల్ రన్ లో 31 కోట్ల లోపు షేర్ ని అందుకుని బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా చేరింది. తెలుగు లో కూడా 9 కోట్ల బిజినెస్ కి 4.4 కోట్ల షేర్ అందుకుని భారీ డిసాస్టర్ గా నిలవగా స్టార్ మా వారు సినిమా కి….

2.5 కోట్లకు పైగా రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులు సొంతం చేసుకోగా చాలా లేట్ గా సినిమా ను టెలికాస్ట్ చేయగా సినిమా సాధించిన TRP రేటింగ్ కూడా అంతే షాకింగ్ గా వచ్చింది అని చెప్పాలి… రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి కేవలం 4.28 TRP రేటింగ్ దక్కింది…

ఇదే టైం లో టెలికాస్ట్ అయిన కొన్ని పాత ఫ్లాఫ్ మూవీస్ TRP రేటింగ్స్ కన్నా కూడా తక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. సూర్య ప్రస్తుతం చేస్తున్న ఆకాశమే హద్దుగా సినిమా తో అయినా తిరిగి తెలుగు లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here