Home TRP రేటింగ్ 3.15 కోట్ల రేటు….మళ్ళీ కుమ్మేసిన ‘అశ్వథ్థామ’ TRP

3.15 కోట్ల రేటు….మళ్ళీ కుమ్మేసిన ‘అశ్వథ్థామ’ TRP

0

ఊహలు గుసగుసలాడే సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగశౌర్య కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ సమంగా మెయిన్ టైన్ చేస్తూ వస్తుండగా రెండేళ్ళ క్రితం వచ్చిన ఛలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని అయితే సొంతం చేసుకోలేదు అనే చెప్పాలి. వేరే బ్యానర్ లో చేసినా ఓన్ బ్యానర్ లో చేసినా కానీ…

సినిమాలు హిట్ గీతని దాటడం లేదు… ఇక ఈ ఇయర్ సస్పెన్స్ థ్రిల్లర్ కం సైకో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’ పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి సినిమాల జోరు వల్ల ట్రాక్ తప్పి…

ఫ్లాఫ్ గానే పరుగును ముగించింది. ఇక ఈ సినిమా ను జెమినీ టీవీ వారు 3.15 కోట్ల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా సినిమా జానర్ కి డీసెంట్ అనిపించే విధంగా మొదటి సారి 9.2 రేటింగ్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించిన ‘అశ్వథ్థామ’ సినిమా…

రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అవ్వగా మంచి హోల్డ్ నే సాధించింది అని చెప్పాలి. కొన్ని సినిమాల మొదటి రేటింగ్ కన్నా కూడా బెటర్ అనిపించే విధంగా ఈ సినిమా టి.ఆర్.పి రేటింగ్ దక్కడం విశేషం. మొత్తం మీద సెకెండ్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమాకి 5.41 టి.ఆర్.పి రేటింగ్ దక్కింది. ఓవరాల్ గా సినిమా ను కొన్న రేటు దృశ్యా…

అండ్ సినిమా జానర్ దృశ్యా టెలివిజన్ లో సినిమా మంచి హోల్డ్ నే సాధించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గరే నాగశౌర్య క్లీన్ హిట్ ని అందుకోవాల్సి ఉంది. రెండు మూడు కొత్త సినిమాలు కమిట్ అయిన నాగశౌర్య త్వరలోనే వాటిని సెట్స్ పైకి తీసుకువెల్లనున్నాడు. మరి వాటిలో ఎ సినిమా తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here