యంగ్ హీరో నిఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్వామిరారా నుండి మంచి విజయాలను సొంతం చేసుకోగా కార్తీకేయ మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు తన కెరీర్ లో అద్బుతమైన విజయాలుగా నిలిచాయి, తర్వాత కొన్ని ఫ్లాఫ్స్ వచ్చినా కానీ అర్జున్ సురవరం సినిమా తో మళ్ళీ ఆడియన్స్ మెప్పు పొందాడు నిఖిల్… ఆ సినిమా తర్వాత నిఖిల్ ఒప్పుకున్న సినిమాలు 18 పేజెస్ అండ్ కార్తీకేయ 2 సినిమాలు… ఈ రెండు సినిమాలు కూడా…
రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా కార్తీకేయ 2 కి ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ వలన కొంచం షూటింగ్ లో ఇబ్బందులు వస్తూ ఉన్నా సినిమా షూటింగ్ సజావుగానే సాగుతూ ఉండగా త్వరలోనే ముందు 18 పేజెస్ సినిమా తో ఆడియన్స్ ముందుకు నిఖిల్ వచ్చే….
అవకాశం ఉందని తెలుస్తుంది… ఇక తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన కార్తీకేయ 2 సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక రీసెంట్ గా సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను గంపగుత్తుగా అమ్మేశారని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి…
ఆ వార్తల ప్రకారం శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రెండూ కలిపి ఆల్ మోస్ట్ 20 కోట్ల రేటు ని ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ రేంజ్ రేటు సొంతం చేసుకోవడం స్టార్ హీరోల సినిమాలకే సాధ్యం అవుతూ ఉంటుంది. కానీ కార్తీకేయ2 పై అంచనాలు కూడా బాగానే ఉండటం తో ఈ రేంజ్ రేటు అంటే సమంజసం అనే చెప్పాలి. ఇక ఈ రేటు నిఖిల్ కెరీర్ లో…
ఆల్ టైం హైయెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 15 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2014 లో వచ్చిన కార్తీకేయ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. మరి వచ్చే ఏడాది లో వచ్చే కార్తీకేయ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సక్సెస్ గా నిలుస్తుందో చూడాలి ఇక..