హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా తర్వాత మాత్రం మంచి విజయాలు పడలేదు… అప్పుడు కొత్త కథలను ఎంచుకోవడం మొదలు పెట్టిన నిఖిల్, స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్న వాడా సినిమాలు అద్బుతమైన విజయాలను అందుకోగా తర్వాత మళ్ళీ హిట్ కోసం ఎదురు చూడాల్సి రాగా… లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ సురవరం సినిమా తో మళ్ళీ హిట్ కొట్టాడు.
ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న నిఖిల్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన కార్తికేయ సినిమా కి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా భారీ లెవల్ లో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే.
లాక్ డౌన్ కన్నా ముందు షూటింగ్ మొదలు అయిన ఈ సినిమా మళ్ళీ మొదలు అవ్వాల్సి ఉండగా అప్పట్లో సినిమా బడ్జెట్ మొత్తం మీద 18 కోట్ల రేంజ్ లో ఉందని వార్తలు వచ్చాయి. నిఖిల్ మార్కెట్ రేంజ్ కి మించి బడ్జెట్ అనుకున్నా ఇప్పుడు ఆ బడ్జెట్ కి కూడా మించి…
ఇప్పుడు సినిమా బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తుంది, ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సినిమా అవ్వడం తో బడ్జెట్ ని పెంచి సుమారు 25 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో సినిమా బడ్జెట్ ఉండబోతుందని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇక సినిమా లో వాడే గ్రాఫిక్స్ భారీగా ఉంటాయని…
గ్రాఫిక్స్ కోసమే సుమారు 15 కోట్ల మేర ఖర్చు చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్ కాబట్టి వర్కౌట్ అయితే ఎం కాదు కానీ ఓవరాల్ గా నిఖిల్ రీసెంట్ మూవీస్ మార్కెట్ అండ్ కలెక్షన్స్ దృశ్యా మాత్రం ఇది భారీ రిస్క్ అనే చెప్పాలి. దీని పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉండగా సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే తిరిగి మొదలు కాబోతుందని సమాచారం….