Home న్యూస్ పాము భయం వల్ల ఆ బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న అల్లరోడు!

పాము భయం వల్ల ఆ బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న అల్లరోడు!

0

కామెడీ మూవీస్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన అల్లరి నరేష్ సుడిగాడు తర్వాత తన సినిమాల మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోగా ఆ తర్వాత హిట్ అందుకోవడానికి చాలా ఏళ్ల టైం పట్టింది… నాంది సినిమాతో తిరిగి హిట్ గీత దాటిన అల్లరోడు రీసెంట్ గా ఉగ్రంతో మెప్పించినా కలెక్షన్స్ పరంగా అనుకున్న రేంజ్ లో అంచనాలను అయితే అందుకోలేక పోయాడు…

కానీ డిఫెరెంట్ మూవీస్ చేయాలని ఫిక్స్ అయిన నరేష్ కొత్త కథలను ఒప్పుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఒక ఇంటర్వ్యూలో తనకి చిన్నప్పటి నుండి కూడా పాములంటే విపరీతమైన భయం అని, ఆ భయంతోనే ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు అల్లరోడు. ఆ సినిమా మరేదో కాదు నిఖిల్ నటించిన బ్లాక్ బస్టర్ కార్తికేయ…

Karthikeya2 16 Days Total Collections!!

అల్లరోడు సుడిగాడు లాంటి హిట్ తర్వాత ఓకే చేసిన కథలలో కార్తికేయ కూడా ఉండగా ఆ కథలో పాముల చుట్టూ కథ ఉండటంతో కథ బాగా నచ్చినా ఆ కథకి నో చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు అల్లరోడు.. చందు మొండేటి తర్వాత అదే కథని నిఖిల్ కి చెప్పడం…

సినిమా భారీ విజయాన్ని ఆ టైంలోనే అందుకోవడం, తర్వాత సీక్వెల్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించడం జరిగాయి.. ఈ సినిమా ఆ టైంలో అల్లరి నరేష్ చేసి ఉంటె సుడిగాడు తర్వాత వెంటనే తనకి సాలిడ్ హిట్ పడి ఉండేది కానీ ఆ సినిమా మిస్ అవ్వడంతో తర్వాత హిట్ కి చాలా టైం పట్టింది అని చెప్పాలి. ఇక తన ఫ్యూచర్ మూవీస్ తో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here