కొన్ని కొన్ని సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ బుల్లి తెర పై మాత్రం మంచి TRP రేటింగ్ లను సొంతం చేసు కుంటూ ఉంటాయి, ఇక కొన్ని సినిమాలు వెండి తెరపై హిట్ అయినా బుల్లితెర పై మాత్రం నిరాశ పరిచే TRP రేటింగ్ లను సాధిస్తాయి. మొదటి కోవ లోకి వచ్చే సినిమా యంగ్ హీరో కార్తికేయ నటించిన 90 ML మూవీ అని చెప్పొచ్చు.
ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సినిమా టార్గెట్ ని అందుకోలేక ఫ్లాఫ్ అయింది, బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా..
ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి 3.10 కోట్ల లోపే షేర్ ని సాధించి భారీ ఫ్లాఫ్ అయింది, కాగా సినిమా రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 5 నెలల తర్వాత రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. టెలికాస్ట్ అయిన మొదటి సారే మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా.
సినిమా రీసెంట్ గా సినిమా స్టార్ మా లో టెలికాస్ట్ అయింది, కాగా సినిమా కి ఫస్ట్ టైం TRP రేటింగ్ సుమారు 10.9 రేంజ్ లో రావడం విశేషం అని చెపాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయినా కానీ బుల్లి తెరపై మాత్రం ఈ సినిమా కి సాలిడ్ గా TRP రేటింగ్ దక్కింది.
RX 100 తర్వాత కెరీర్ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయ నటించిన ఈ సినిమా అంచనాలను వెండి తెరపై అందుకోక పోయినా కానీ బుల్లితెర పై మాత్రం తొలిసారి మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు కలిసి వచ్చింది అని చెప్పొచ్చు…