ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ గా సినీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా KGF Chapter 2, 2018 లో వచ్చిన ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో సెకెండ్ పార్ట్ పై అంచనాలు మరో లెవల్ కి చేరుకోగా రెండో పార్ట్ ఇప్పుడు ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా పూర్తీ చేసుకోగా….
U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 2 గంటల 48 నిమిషాల రేంజ్ రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుందని సమాచారం. ఇక సెన్సార్ వాళ్ళ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ ఏంటి అనేది కూడా బయటికి వచ్చేసింది.
ఆ టాక్ చాలా వరకు పాజిటివ్ గా ఉండటం విశేషం అని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వడం మిక్సుడ్ టాక్ తోనే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది, కానీ సెకెండ్ పార్ట్ కి సెన్సార్ వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండటం కచ్చితంగా సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర…
కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. స్టొరీ పాయింట్ ఆల్ మోస్ట్ అందరికీ తెలిసిందేనని, గరుడ ని చంపి KGF ని సొంతం చేసుకున్న హీరో ముందు అనేక అవరోధాలు ఉంటాయి, వాటిని ఎదురు నిలిచి హీరో తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది అసలు కథ అని, కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని అంటున్నారు…
హీరోయిజం ఎలివేట్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి మరోసారి మేజర్ హైలెట్స్ అని చెబుతూ ఉండగా ఫైనల్ గా సినిమా కి హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ లో టాక్ సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తుంది అని చెప్పాలి. ఇదే రేంజ్ టాక్ ఇక థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక KGF Chapter2 రికార్డుల వర్షం కురిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…