Home న్యూస్ తెలుగు కి మించి హిందీలో రచ్చ చేసిన ఖిలాడి….ఇక రచ్చ ఖాయమా!

తెలుగు కి మించి హిందీలో రచ్చ చేసిన ఖిలాడి….ఇక రచ్చ ఖాయమా!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు రావడానికి టైం వచ్చేసింది. సినిమా 11న గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్… ఓవరాల్ గా ట్రైలర్ లో కథ గురించి ఏమి రివీల్ చేయకున్నా కానీ ఓవరాల్ గా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం తో……

సినిమా పై ఇప్పుడు అంచనాలు అయితే బాగానే ఉన్నాయి అని చెప్పాలి. కాగా ట్రైలర్ ను తెలుగు లో అనుకున్న టైం కి రిలీజ్ చేయలేక పోయిన మేకర్స్ ఆలస్యంగా ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో ఇక్కడ కొత్త రికార్డులు రవితేజ కెరీర్ లో నమోదు అవ్వలేదు….

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 5.3 మిలియన్ వ్యూస్ ని 236K లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ ను కొన్ని గంటల ఆలస్యంగా హిందీ లో కూడా డబ్ వర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా అక్కడ మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది అని చెప్పాలి 24 గంటల్లో…

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఖిలాడి ట్రైలర్ కి హిందీలో 6.93 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ 158K లైక్స్ మార్క్ ని అందుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది. తెలుగు కి మించి హిందీలో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఖిలాడి ట్రైలర్ అక్కడ రచ్చ చేసింది అని చెప్పాలి. దాంతో ఇనీషియల్ రెస్పాన్స్ అదిరి పోవడంతో ఖిలాడి హిందీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. హిందీలో సినిమాను మేకర్స్ ఓన్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం, కానీ ఆ ఓన్ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంత ఉంటుంది అన్నది త్వరలో తెలియనుంది. మరి ఓవరాల్ గా ఖిలాడి హిందీలో కూడా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here