Home న్యూస్ తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్…తెలుగు డైరెక్ట్ రిలీజ్ బిజినెస్ ఇదే!!

తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్…తెలుగు డైరెక్ట్ రిలీజ్ బిజినెస్ ఇదే!!

0

టెలివిజన్ లో వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఆడియన్స్ కి బోర్ ఫీల్ అయ్యేలా చేస్తున్న కొన్ని ఛానెల్స్ అప్పుడప్పుడు వాళ్లకి రిలీఫ్ ఇవ్వాలని ఇది వరకు శాటిలైట్ రైట్స్ అమ్మకం కాని సినిమాలను ఇప్పుడు కొని టెలికాస్ట్ చేస్తూ వస్తుండగా మరో పక్క ఇతర భాషల సినిమాలను డైరెక్ట్ తెలుగు లో ఇప్పుడు డబ్ చేసి డైరెక్ట్ గా టెలివిజన్ లో లేదా యాప్ లో టెలికాస్ట్ కూడా చేస్తున్నాయి,

ఆహా వీడియో సినిమాల పరంగా డైరెక్ట్ రిలీజ్ చేస్తూ వస్తుండగా ఇప్పుడు జీ 5 వాళ్ళు కూడా ఇందుకు సిద్ధం అవుతున్నారు. తమిళ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న జయం రవి కాజల్ అగర్వాల్ ల…

కాంబినేషన్ లో రూపొందిన సినిమా కోమలి ని తెలుగు లో డబ్ చేసి డైరెక్ట్ రిలీజ్ ను చేయబోతున్నారు రెండు రోజుల్లో… ఇక సినిమా తమిళ్ లో 17 కోట్ల మేర షేర్ ని వసూల్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యునానిమస్ ఎంటర్ టైనర్ అని అందరూ మెచ్చుకున్నారు.

ఇక తెలుగులో డైరెక్ట్ రిలీజ్ కోసం ఈ సినిమా కి 3.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. జయం రవి కి తెలుగు లో పెద్దగా మార్కెట్ లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ కాజల్ కి ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా తమిళ్ లో సాధించిన విజయం దృశ్యా ఈ లెవల్ లో డీల్..

సెట్ అయిందని అంటున్నారు. 4 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు లో ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా, హీరో కొన్నేళ్ళు కోమా లో వెళ్ళడం ఇప్పటి పరిస్థితులకు హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది ఫుల్ కామెడీ తో ఎంటర్ టైన్ చేశారు సినిమాలో… మరి తెలుగు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here