బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ కంబ్యాక్ ని రవితేజ సొంతం చేసుకున్నాడు. రవితేజ ఇది వరకు క్రాక్ మూవీతో సెన్సేషనల్ కంబ్యాక్ ని 50% ఆక్యుపెన్సీతో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఆ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు రొటీన్ టాక్ తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. క్రాక్ మూవీ 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో 29.61 కోట్ల షేర్ ని 49.35 కోట్ల గ్రాస్ ను అందుకుంది సినిమా.
ఇక ఇప్పుడు ధమాకా మూవీ 2 వారాలు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో 33.18 కోట్ల షేర్ ని 60.51 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా క్రాక్ మూవీ 2 వారాల్లో 31.85 కోట్ల షేర్ ని 53 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ధమాకా మూవీ…
2 వారాల్లో 38.88 కోట్ల షేర్ ని 73.40 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని క్రాక్ కన్నా కూడా ఓవరాల్ గా 7 కోట్లకు పైగా షేర్ లీడ్ తో దూసుకు పోతూ అతి త్వరలో రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేయబోతుంది. లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని ఇంకా అందుకుంటుందో చూడాలి.