మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ని 50% ఆక్యుపెన్సీ తోనే సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వరుస ఫ్లాఫ్స్ కి సాలిడ్ ఆన్సర్ గా కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా ని కొన్న బయ్యర్లు అందరూ కూడా…
ఓ రేంజ్ లో ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా వల్ల నిర్మాత కి ఎంత లాభం వచ్చింది, సినిమా బడ్జెట్ ఎంత టోటల్ బిజినెస్ ఎంత చేసింది లాంటి వివరాలను గమనిస్తే… సినిమా కి మొత్తం మీద నిర్మాత పెట్టిన బడ్జెట్ 28 కోట్లు, కానీ లేట్ అవ్వడం రీ షూట్స్…
లాంటివి చేయడం వలన బడ్జెట్ మరింత పెరిగింది, ఓవరాల్ గా 32 కోట్ల మేర బడ్జెట్ ఈ సినిమా కి రిలీజ్ టైం కి అయ్యింది అన్న టాక్ ట్రేడ్ లో ఉంది… ఇక సినిమా బిజినెస్ ను గమనిస్తే… థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 17 కోట్ల కి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే… శాటిలైట్ రైట్స్ 6 కోట్ల రేటు సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ 8 కోట్ల రేటు ని సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఈ సినిమాకి 11 కోట్ల బిజినెస్ జరగగా మ్యూజిక్ రైట్స్ 80 లక్షల రేటు సొంతం అయింది, ఇక సినిమా తమిళ్ లో అలాగే మలయాళం లో కూడా డబ్ అవ్వగా… రెండు చోట్ల మొత్తం మీద 2.5 కోట్ల బిజినెస్ కి శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి.
మొత్తం మీద నాన్ థియేట్రికల్ బిజినెస్ 28.3 కోట్ల బిజినెస్ చేయగా థియేట్రికల్ బిజినెస్ తో కలిపి చూస్తే 45.3 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బడ్జెట్ ఓవర్ అయినా 32 కోట్లకి సినిమా ఆల్ మోస్ట్ 13 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ 39 కోట్లకు పైగా షేర్ తో 22 కోట్లకి పైగా ప్రాఫిట్ ని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రూ బ్లాక్ బస్టర్ అండ్ సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచింది రవితేజ కి..