Home గాసిప్స్ ఇదేమి క్రేజ్ సామి…120 కోట్లంట…..అరాచకం ఇది!!

ఇదేమి క్రేజ్ సామి…120 కోట్లంట…..అరాచకం ఇది!!

0

ఇప్పుడు ఇండియా మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల్లో KGF2 కూడా ఒకటి… 2018 లో వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ కే.జీ.ఎఫ్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ లో తప్పితే మిగిలిన చోట్ల చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్లా అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది, దాంతో ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కన్నడ లోనే కాకుండా ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఇప్పుడు.

ఈ సినిమా చాప్టర్ 2 కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…. ఈ ఇయర్ జులై 16 న భారీ లెవల్ లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్న ఈ సెన్సేషనల్ మమ్మోత్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ పరంగా ఇప్పుడు సంచలనాలను సృష్టించే రేటు ని సొంతం చేసుకోబోతుంది అంటూ ఇండస్ట్రీ లో చెప్పుకున్నారు… ఇక రీసెంట్ గా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కి…

సుమారు 55 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని వార్తలు వస్తుండగా ఇప్పుడు సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కింద కూడా ఆల్ టైం రికార్డ్ రేటు దక్కుతుందని సమాచారం… ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కి అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ కలిపి….

ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ లో రేటు దక్కించుకుందని సమాచారం… ఇది నిజమైతే ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఇది వరకు అఫీషియల్ గా రోబో 2.0 సినిమా కి 110 కోట్ల రేంజ్ లో రేటు దక్కిందని సమాచారం. ఇప్పుడు KGF 2 సినిమా రైట్స్ కూడా నిజం అయితే సౌత్ లో బిగ్గెస్ట్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..

మొదటి పార్ట్ టోటల్ రన్ లో 220 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళ ని సాధించి దుమ్ము లేపింది, ఈ సినిమా కలెక్షన్స్ ఊహకందని రేంజ్ లో ఉండే అవకాశం ఉంది…ఇక జులై 16 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here