బహుశా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో రీసెంట్ మూవీస్ లో ఈ రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా రిలీజ్ అయిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమె అని చెప్పాలి. రెండు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా కుమ్మేస్తుంది అనుకున్నా ఆంధ్రలో సినిమా ను బ్యాన్ చేయడం తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆంధ్ర లో రిలీజ్ కాలేదు.
కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ కలెక్షన్స్ రెండు రాష్ట్రాలలోనే వస్తాయి, కానీ ఇప్పుడు ఆంద్ర లో బ్యాన్ అవ్వడం తో టోటల్ ప్రెజర్ నైజాం లో నే పడింది అని చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం లో పర్వాలేదు అనిపించే విధంగా 40% వరకు బుకింగ్స్ జరిగాయి.
ఇక ఈవెనింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా మెల్లి మెల్లి గా జోరు అందుకుంటూ దూసుకు పోతుండటం తో తొలిరోజు ఇక్కడ ఎలాంటి వసూళ్లు సినిమా సాధిస్తుంది అన్నది ఆసక్తి గా మారింది. ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి 60 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ఖాయం అని చెప్పాలి.
ఇక ఈవెనింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా నైజాం ఏరియా లో తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
అదే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు మరింతగా ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, మరి రోజు ముగిసే సరికి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.