Home న్యూస్ తెలుగు సినిమా చరిత్రకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా!

తెలుగు సినిమా చరిత్రకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా!

1

     రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్…. మొదలు అయినప్పటి నుండి భారీ విమర్శలతో పాటు భారీ క్రేజ్ ని కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు పార్టుల రిజల్ట్ తర్వాత క్రేజ్ మరింత గా పెరిగి పోయినా రిలీజ్ అవ్వడానికి కొంత సమయం పట్టడం తో ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆంద్ర ప్రదేశ్ లో మాత్రం సినిమా కి చుక్కెదురయ్యింది.

ప్రభుత్వం పై ముఖ్యమంత్రి పై నెగటివ్ ప్రచారం చేసేలా సినిమా ఉందని హై కోర్టులో కేసు వేయడం తో సినిమా అక్కడ బ్యాన్ చేయగా ఇక సినిమా ఎలేక్షన్స్ తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ రామ్ గోపాల్ వర్మ అందరికీ షాక్ ఇస్తూ…

సినిమా కి ఆంధ్రా లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా రిలీజ్ చేశాడు, ఇక్కడే సినిమా సరికొత్త చరిత్ర తో పాటు ఒక అపవాదు ని కూడా మూట గట్టుకుంది, ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్ర లోనే ఒక సినిమా ఒక ప్రాంతం లో రిలీజ్ కాకుండా మరో ప్రాంతం లో రిలీజ్ అవ్వలేదు.

రెండు రాష్ట్రాలు విడిపోయినా కానీ పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని సినిమాలు ఒకే సమయం లో రిలీజ్ అవుతూ వచ్చాయి, కానీ చరిత్ర లో తొలిసారిగా ఒక ఏరియా మొత్తం మీద రిలీజ్ కాకుండా మరో ఏరియా లో రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా…

సరికొత్త చరిత్ర సృష్టించగా అదే సమయం లో ఇలా రిలీజ్ సమయం లో అనుకోని కారణాలతో బ్యాన్ కి గురి అయ్యి కూడా ఒక ఏరియాలో రిలీజ్ అయిన సినిమా గా అపకీర్తి ని సొంతం చేసుకుంది, ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఒక్క సినిమాతో పలు రికార్డులు నమోదు చేసినట్లు అయింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here