Home న్యూస్ డే 1 అన్ని రికార్డులు ఔట్ అంటున్నారే….ఇదేమి షాక్ సామి!

డే 1 అన్ని రికార్డులు ఔట్ అంటున్నారే….ఇదేమి షాక్ సామి!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ పేరు మార్చుకుని లక్ష్మీ గా రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కోసం ఏకంగా 125 కోట్లు ఖర్చు చేశారు డిస్నీ ప్లస్ వాళ్ళు. కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ…

నార్త్ లో మాత్రం సినిమా కి కంప్లీట్ నెగటివ్ రివ్యూలు ఇచ్చేశారు, కారణాలు ఏంటో తెలియదు కానీ కంప్లీట్ నెగటివ్ రివ్యూలను అక్కడ సొంతం చేసుకున్న ఈ సినిమా కి ఆల్ ఇండియా లెవల్ లో మాత్రం మొదటి రోజు రికార్డ్ లెవల్ లో వ్యూస్ దక్కాయని అఫీషియల్ గా…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కన్ఫాం చేయడం ఇప్పుడు టోటల్ సోషల్ మీడియా లో ఫైర్ పుట్టించింది, కానీ అసలు వివరాలలోకి వెళితే లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డులను సొంతం చేసుకోగా…

వ్యూయర్ షిప్ పరంగా కూడా మొదటి రోజు 90 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిందని న్యూస్ బయటికి వచ్చింది, ఆ రికార్డ్ ను ఏ సినిమా అందుకోవడం కష్టమే అయినా ఇప్పుడు లక్ష్మీ బ్రేక్ చేసింది అని చెబుతుండటంలో ఏమాత్రం నిజం లేదని తేల్చేస్తున్నారు. దిల్ బేచారా సినిమాను అందరికీ ఫ్రీగా చూసేలా చేశారు.

కానీ లక్ష్మీ సినిమా ను డిస్నీ ప్లస్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళే చూశారు కాబట్టి అలా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళ నుండి యూనిక్ వ్యూస్ ప్రకారం హైయెస్ట్ వ్యూస్ ని మొదటి రోజు సొంతం చేసుకుందని వారు అఫీషియల్ గా చెబుతున్నారని సమాచారం. లెక్కలు అన్నీ బయటికి రాలేదు కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here