Home న్యూస్ రాకీ భాయ్ వచ్చేశాడు…మెయిన్ విలన్ కూడా….20 రోజుల్లో ఔట్…రచ్చ ఖాయం!!

రాకీ భాయ్ వచ్చేశాడు…మెయిన్ విలన్ కూడా….20 రోజుల్లో ఔట్…రచ్చ ఖాయం!!

0

2020 ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో KGF పార్ట్ 2 కూడా ఒకటి, మొదటి పార్ట్ సాధించిన ఊహకందని విజయం తర్వాత రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ కి వెళ్ళగా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా దసరా బరిలో నిలవాల్సింది కానీ కరోనా వలన అది జరగ లేదు కానీ సినిమా ఇప్పుడు వచ్చే ఇయర్ సంక్రాంతి కి…

ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా, సినిమా లో ఇప్పుడు బాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు, కాగా దాదాపు టాకీ పార్ట్ పూర్తీ అయినా కానీ ఒక యాక్షన్ పార్ట్ మాత్రం బాలెన్స్ ఉండగా టీం ఇప్పుడు హైదరాబాదు చేరుకున్నారు.

ఇక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్ సెట్ లో మిగిలిన షూటింగ్ ని కంప్లీట్ చేస్తారని సమాచారం. 20 రోజుల వర్కింగ్ షెడ్యూల్ ఉన్న ఈ ఫైనల్ షెడ్యూల్ లో మెయిన్ విలన్ అధీరా గా చేస్తున్న సంజయ్ దత్ కూడా కాన్సర్ భారీన పడ్డా కానీ ఈ సినిమా కోసం సెట్స్ పైకి త్వరలో అడుగు పెట్టబోతున్నాడు.

ముందు డూప్ తో మ్యానేజ్ చేద్దాం అనుకున్నారట కానీ సంజయ్ దత్ నేను వస్తున్నాను అని చెప్పి వస్తుండటం తో టీం మొత్తం స్పెషల్ కేర్ తీసుకోబోతున్నారట. నవంబర్ మొదటి వారం 10 రోజుల్లో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు లాక్ డౌన్ టైం లోనే జరగగా మిగిలిన డబ్బింగ్ పనులు…

ఇతర పనులను డిసెంబర్ కల్లా పూర్తీ చేసి సినిమాను ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారు, అప్పటికి పరిస్థితులు చాలా వరకు మెరుగు అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రాకీ భాయ్ రాంపేజ్ సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here