బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. బాడీ పెంచాడు, సినిమా లో రియల్ బాక్సర్ లా అనిపించాడు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం టోటల్ ఇండియా మేజర్ సిటీలకు వెళ్లి ప్రమోట్ చేశాడు. హిందీ లో అయితే ఏకంగా అన్ని మేజర్ ఏరియాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు, కానీ బాలీవుడ్ ప్రజెంట్ నడుస్తున్న బాయికాట్ ట్రెండ్ పై…
తను చేసిన కామెంట్స్ వలన సినిమా పై ఆల్ రెడీ బాయికాట్ నినాదాలు వినిపించినా విజయ్ కామెంట్స్ తర్వాత అది మరింత పీక్స్ కి వెళ్లి సినిమాను బాయికాట్ చేయాలి అంటూ భారీ ఎత్తున ట్రెండ్స్ జరగడంతో సినిమా ను అక్కడ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేయాలనీ…
డిసైడ్ అయ్యి 25న అక్కడ ప్రీమియర్స్ నే వేశారు. కానీ ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమాకి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ లభించగా ఆ టాక్ అంతటా స్ప్రెడ్ అయింది. హిందీ లో కూడా ఆ టాక్ భారీగా స్ప్రెడ్ అవ్వడంతో ఇక సినిమా అక్కడ కలెక్షన్స్ విషయంలో…
ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందో అన్నది డౌట్ లో పడిపోగా అప్పటికే బాయికాట్ కామెంట్స్ మరింతగా పెరిగి పోగా ప్రీమియర్స్ తో 1.25 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా హిందీలో మొదటి రోజు 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని అనుకున్న అంచనాలకు మించి కలెక్షన్స్ ని హిందీలో సొంతం చేసుకుంది. డిసాస్టర్ టాక్ కి ఈ రేంజ్ లో..
ఒకసారి సినిమా అక్కడ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 5.75CR(1.25cr Preview)
👉Day 2 – 4.25CR
👉Day 3 – 3.75CR
👉Day 4 – 1.35CR
Total :- 15.10CR(6.75Cr~ Share)
బాయికాట్ అన్నారు, డిసాస్టర్ టాక్ వచ్చింది అయినా కానీ సినిమా అక్కడ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే అందుకుంది, తెలుగు రాష్ట్రాలతో పోల్చితే బెటర్ కలెక్షన్స్ నే సాధిస్తుంది అని చెప్పాలి…