డిఫెరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం ఎప్పటి కప్పుడు చేస్తూ వస్తున్న విజయ్ ఆంటోని(Vijay Antony) బిచ్చగాడు(Bichagadu Movies) తో తెలుగు లో మంచి పాపులారిటీని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ లవ్ గురు(Love Guru Movie Telugu Review) తో వచ్చేశాడు…ట్రైలర్ చూసిన తర్వాత…
సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ బాగానే ఉండేలా అనిపించగా సినిమా చూసిన తర్వాత ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సెంటిమెంట్ ను కూడా బాగానే మిక్స్ చేసి పాస్ మార్కులు అయితే కొట్టేశాడు అని చెప్పాలి. కథ పరంగా 35 ఏజ్ లో పెళ్లి కి ఒప్పుకుని ఒక చావు ఇంట్లో హీరోయిన్ ని చూసి ఇష్టపడే హీరో తనని పెళ్లి చేసుకుంటాడు…
కానీ హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం ఉండదు…ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని ఉంటుంది…మరి హీరో ఏం చేశాడు ఇద్దరు కలిశారా లేదా అన్నది మొత్తం మీద సినిమా కథ…సినిమా కథ పాయింట్ చాలా వరకు 2008 టైంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన రబ్ నే బనాదీ జోడి సినిమా గుర్తుకు వస్తుంది…అలాగే స్క్రీన్ ప్లే చాలా వరకు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లే సాగుతుంది…
అయినా కూడా ఎంటర్ టైన్ మెంట్ వర్కౌట్ అవ్వడం, సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఒకటి బాగుండటం, అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగా మెప్పించడంతో కథ రొటీన్ గానే అనిపించినా కూడా అటు ఎంటర్ టైన్ మెంట్ పరంగా ఇటు సెంటిమెంట్ పరంగా మేజర్ పోర్షన్ ఆఫ్ మూవీ ఆకట్టుకోవడంతో…
రొటీన్ కథ, ప్రిడిక్ట్ చేసేలా ఉన్న స్క్రీన్ ప్లే, అక్కడక్కడా సినిమా డ్రాగ్ అయినా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి టైం పాస్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.. విజయ్ ఆంటోని పెర్ఫార్మెన్స్ బాగుండగా హీరోయిన్ పర్వాలేదు అనిపిస్తుంది…
యోగిబాబు, వీటీవీ గణేష్‌ల కామెడీ బాగానే మెప్పించింది, పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి, డైరెక్టర్ ఓల్డ్ కథనే ఉన్నంతలో ఆడియన్స్ కి నచ్చేలా చాలా వరకు మ్యానేజ్ చేశాడు… ఓవరాల్ గా ఆడియన్స్ ఎలాగూ పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్స్ కి వెళతారు కాబట్టి ఎండ్ అయ్యే టైంకి కొన్ని ఫ్లాస్ ఉన్నా పర్వాలేదు సినిమా బాగానే ఉంది అనుకుంటూ థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….