Home న్యూస్ లవ్ మీ ట్రైలర్ రివ్యూ….యూనిక్ స్టోరీ లా ఉంది…కానీ!!

లవ్ మీ ట్రైలర్ రివ్యూ….యూనిక్ స్టోరీ లా ఉంది…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి సినిమా రౌడీ బాయ్స్ తో పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) ఇప్పుడు తన రెండో సినిమాగా కొత్త స్టోరీ పాయింట్ ను ఎంచుకుని ఇప్పుడు మే 25న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు… బేబీ సినిమాతో మెప్పించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న తన లేటెస్ట్ మూవీ…

లవ్ మీ(Love Me Movie) అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కాన్సెప్ట్ టాలీవుడ్ కి చాలా కొత్తగా అనిపించేలా మెప్పించింది అని చెప్పాలి…మనుషులను కాకుండా ఒక దెయ్యాన్ని ప్రేమించే హీరో తన ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో…

లవ్ మీ సినిమా తెరకేక్కుతూ ఉండగా ట్రైలర్ లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ బాగా మెప్పించాయి అని చెప్పాలి.. యూనిక్ స్టోరీ పాయింట్ తో వస్తున్న లవ్ మీ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించగా ట్రైలర్ చూసిన తర్వాత కొంచం కాన్సెప్ట్ హిందీలో వచ్చిన స్త్రీ మూవీ ని పోలినట్లు అనిపించింది…

అది ఎంతవరకు నిజం అన్నది లవ్ మీ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కానీ రీసెంట్ టైంలో వచ్చిన తెలుగు మూవీస్ లో యూనిక్ కథతో వస్తున్న లవ్ మీ సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సమ్మర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మే 25న సినిమా ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here