లాస్ట్ ఇయర్ వాలంటైన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన ఒరు అదాల్ లవ్ అనే మలయాళ సినిమా లోని పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ అనే అమ్మాయి తన కనురెప్ప లతో చేసిన విన్యాసాలతో ఓవర్ నైట్ లో పాపులర్ అవ్వగా ఆ సినిమా ఏడాది తర్వాత ఇప్పుడు భారీ గా మలయాళం మరియు తెలుగు లో రిలీజ్ అయ్యింది. కాగా సినిమా కి ఓవరాల్ గా వస్తున్న టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండి..
స్టొరీ పాయింట్: ఒక స్కూల్.. చదువుకునే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడటం, కానీ ఒకరి ప్రేమ ని ఒకరు చెప్పుకోక పోవడం తో కొన్ని గొడవలు, తర్వాత ఇద్దరు ని కలపడానికి మరో అమ్మాయి ట్రై చేయడం తర్వాత అసలు ఎలా కథ సుకాంతం అయింది అన్నది అసలు కథ.
హైలెట్స్:
* ముందుగా చెప్పినట్లే ప్రియా ప్రకాష్ వారియర్ చేసే వింక్ సీన్, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందనుకోండి…
*లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అండ్ ఇద్దరు బాగానే నటించారు,
*ఒకటి రెండు కామెడీ సీన్స్ అక్కడక్కడా ఎదో అలా అలా నవ్విస్తాయి.
మైనస్ పాయింట్స్:
* కథ లో దమ్ము లేక పోవడం, ట్రాజిక్ ఎండింగ్ ని భరించడం కష్టమే..
* కథ, కథనం చూస్తున్న ఆడియన్స్ కి ఏమాత్రం ఎక్కే విధంగా లేక పోవడం,
* మలయాళ ట్రీట్ మెంట్ ఎక్కువగా ఉండటం, ఇక్కడ ఆడియన్స్ కి నచ్చలేదు,
* ఇలా చెప్పుకుంటూ పొతే సినిమాలో మైనస్ పాయింట్స్ కోకొల్లలు….
ఓవరాల్ గా లవర్స్ డే అనే సినిమా ఒక ఇయర్ క్రితం ఉన్న అంచనాలను ఇయర్ మొత్తం మ్రోసినా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేక చతికిల బడింది. కొన్ని సీన్స్ బాగున్నా ఓవరాల్ మూవీ పేషేన్స్ కి పరీక్ష పెట్టింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా రేటింగ్ 1.75 స్టార్స్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.