Home న్యూస్ లవ్ టుడే రివ్యూ – రేటింగ్!!

లవ్ టుడే రివ్యూ – రేటింగ్!!

0

తమిళనాడులో రిలీజ్ అయిన రోజు నుండి కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ దూసుకు పోయిన సినిమా లవ్ టుడే… అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమాను తెలుగు లో డబ్ చేసి దిల్ రాజు గ్రాండ్ గా రిలీజ్ చేయగా, ఆడియన్స్ లో సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు నిజం చేసిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. లవ్ లో పడ్డ హీరో హీరోయిన్స్ ఒకరోజు హీరోయిన్ ఫాదర్ ని కలవడానికి వెళ్ళగా వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవడానికి ఒక కండీషన్ పెడతాడు, ఇద్దరూ ఒకరోజు ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుని 24 గంటల తర్వాత కూడా పెళ్లికి సిద్ధం అంటే పెళ్లి చేస్తానని చెబుతాడు, ఫోన్లు మార్చుకున్న తర్వాత ఏం జరిగింది…

ఇద్దరి లైఫ్ లో తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సింపుల్ అండ్ యూనిక్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదలు అవ్వడం కొంచం స్లోగా స్టార్ట్ అయినా హీరోయిన్ ఫాదర్ సత్యరాజ్ సీన్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి జోరు అందుకుంటుంది, ఆ ఫ్లో ఇంటర్వెల్ దాకా ఓ రేంజ్ లో ఆకట్టుకున్న తర్వాత…

సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో మెప్పిస్తూ క్లైమాక్స్ కొంచం ఎమోషనల్ అండ్ మెసేజ్ ఇస్తూ ముగుస్తుంది, రాధిక శరత్ కుమార్ కూడా బాగా నటించగా హీరో హీరోయిన్స్ ఇద్దరూ ఆకట్టుకున్నారు, సత్యరాజ్ రోల్ కూడా ఆకట్టుకోగా యోగిబాబు రోల్ మెప్పిస్తుంది, యువన్ శంకర్ రాజా సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా…

ఓవరాల్ గా సింపుల్ స్టొరీ పాయింట్ చాలా వరకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన డైరెక్టర్ కం హీరో హిలేరియస్ ఎంటర్ టైనర్ తో మెప్పించాడు…. అక్కడక్కడా కొంచం లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించినా ఓవరాల్ గా పైసా వసూల్ ఎంటర్ టైనర్ అని చెప్పాలి. సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్… ఫ్రెండ్స్ తో వెళితే మీ ఎంజాయ్ మెంట్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here