Home న్యూస్ రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నారు….రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి!

రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నారు….రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న టైం లో సినిమాలు ఎలాంటి ఇబ్బంది పడకుండా రిలీజ్ ను సొంతం చేసుకోవడం కూడా చాలా కష్టమైన విషయమే. ఫైనాన్స్ డబ్బులతో సినిమాలను నిర్మించడం లాంటివి లాస్ట్ మినట్ రిలీజ్ లకు ఇబ్బందులు కలిగించడం అన్నది సహజంగా జరుగుతూ ఉంటాయి, అన్నీ రిలీజ్ కి ముందు సెట్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాలు సజావుగా రిలీజ్ అవుతాయి, ఏమైనా ఎఫెక్ట్ అయితే కష్టాలు తప్పవు.

రీసెంట్ గా కోలివుడ్ లో శింభు నటించిన క్రేజీ మూవీ మానాడు తెలుగు లో ది లూప్ పేరుతో ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సింది, కానీ చివరి నిమిషంలో ఫైనాన్స్ ఇబ్బందుల వలన సినిమా కి అడ్డు అవ్వగా తెలుగు లో రిలీజ్ ఆగిపోగా తమిళ్ లో ఆల్ మోస్ట్ ఇక రిలీజ్ లేదు…

సినిమా పోస్ట్ పోన్ అయినట్లే అని అన్నారు, కానీ చివరి నిమిషంలో నిర్మాతలు ఎలాగోలా పరిస్థితులు సెట్ చేసి మార్నింగ్ షో టైం కి షోలు పడేలా చేశారు, కానీ అప్పటి వరకు షోలు పడతా లేవా, అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలతో రిలీజ్ అయిన…

మానాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోగా అప్పటి వరకు సినిమా కోసం ఎదురు చూసిన ఆడియన్స్ సినిమా థియేటర్స్ లో ఉందని తెలిసి ఎగబడి థియేటర్స్ కి వెళ్ళడం మొదలు పెట్టగా సినిమా రిలీజే డౌట్ అనుకుంటే ఓవరాల్ గా మొదటి రోజు సినిమా కలెక్షన్స్ పరంగా సంచలన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

శింభు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా తమిళనాడు ఈ ఇయర్ టాప్ 4 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి ఫస్ట్ డే 7.75 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 11 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది. లాంగ్ రన్ లో రీసెంట్ బ్లాక్ బస్టర్ డాక్టర్ రేంజ్ లో మ్యాజిక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here