Home న్యూస్ ఓరినీ…రంగం సినిమా ఫస్ట్ అనుకున్న హీరో వేరు…కొద్దిగా షూటింగ్ కూడా చేసి ఆపేశారు!!

ఓరినీ…రంగం సినిమా ఫస్ట్ అనుకున్న హీరో వేరు…కొద్దిగా షూటింగ్ కూడా చేసి ఆపేశారు!!

0

13 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సాలిడ్ విజయాన్ని నమోదు చేసిన సినిమా రంగం…. జీవా హీరోగా కే వి ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిస్తే తెలుగు లో మట్టుకు బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. రిలీజ్ అయిన…

మూడు నాలుగు వారాలు పెద్దగా ఆడలేదు కానీ తర్వాత అద్బుతంగా కలెక్షన్స్ ని సాధిస్తూ లాంగ్ రన్ లో ఏకంగా 12.2 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ముందు వేరే హీరోతో అనుకుని కొంత బాగం షూటింగ్ కూడా చేశారు అని రీసెంట్ గా…

కొన్ని విషయాలు బయటికి వచ్చాయి. నిజానికి ఈ సినిమా ముందు జీవా తో అనుకోలేదు. ముందు అక్కడ యంగ్ హీరోల్లో మంచి క్రేజ్ ఉన్న శింభు హీరోగా ఈ సినిమాను అనుకోగా కొంత భాగం షూటింగ్ కూడా చేయగా సడెన్ గా సినిమా నుండి హీరో తప్పుకున్నాడట. దానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు…

కానీ అసలు కారణం ముందు శింభు సినిమాలో తన పక్కన తమన్నా హీరోయిన్ అయితే బాగుటుందని డైరెక్టర్ కి నిర్మాతకి చెప్పగా తమన్నా డేట్స్ ఖాళీ లేవని, ఎక్కువ డబ్బ్బులు ఇవ్వాల్సి వస్తుందని నో చెప్పడం తో మాటా మాటా పెరిగి గొడవ జరగడం తో శింభు సినిమా నుండి తప్పుకున్నాడట… తర్వాత శింభు ప్లేస్ లో జీవా ని తీసుకున్నారు…

తర్వాత సినిమా మళ్ళీ షూట్ చేయగా జీవా కి హీరోగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారింది ఈ సినిమా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత తెలుగు లో జీవా సినిమాలు అనేకం డబ్ అయ్యాయి కానీ ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఒక వేల శింభు చేసి ఉంటే తన రేంజ్ మరో లెవల్ లో ఉండి ఉండేది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here