Home న్యూస్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ…..తెలుగు రిలీజ్ ఆపేశారు…కానీ!

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ…..తెలుగు రిలీజ్ ఆపేశారు…కానీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు మరో భాషలో ఆడియన్స్ ముందుకు రావడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల రిలీజ్ లను చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేయడం లేదా ఆపేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటిదే ఓ బ్లాక్ బస్టర్ సినిమా విషయం లో జరిగింది అని చెప్పాలి. ఆ సినిమా నే మానాడు…

తమిళ్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ ని రీసెంట్ టైం లో సొంతం చేసుకోలేక పోయిన హీరో శింభు నటించిన ఈ సినిమా కి గ్యాంబ్లర్ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రాగా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉండగా…

శింభు ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే టైం లో రిలీజ్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ తమిళ్ లో చివరి నిమిషంలో రిలీజ్ రోజే ఎదురుదెబ్బ పడేలా ఉండటంతో ఎలాగోలా సినిమాను సజావుగా రిలీజ్ చేసినా తెలుగు లో మాత్రం సినిమా…

థియేట్రికల్ రిలీజ్ ను ఆపేయాల్సి వచ్చింది, ఇంతలో సినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వడం సెన్సేషనల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయడం జరగగా తెలుగు లో ఆల్ రెడీ డబ్ చేసి పెట్టినా కానీ సినిమాను తెలుగు లో ఆపేసి రీమేక్ రైట్స్ ని తీసుకుని తెలుగు డబ్బింగ్ ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. తమిళ్ లో సినిమా..

టోటల్ రన్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా తెలుగు లో రీమేక్ ని రీసెంట్ గా అనౌన్స్ చేసినా కానీ అప్పటికే సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ని కూడా రిలీజ్ చేశారు సోనీ లివ్ యాప్ లో… దాంతో ఇప్పుడు సినిమా తెలుగు లో అటు డబ్బింగ్ వర్షన్ థియేటర్స్ లో రాకుండా ఉన్నప్పటికీ ఇటు రీమేక్ కూడా ఇప్పుడు ఉంటుందా లేదా అన్న అనుమానాలు మొదలు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here