యూత్ స్టార్ నితిన్ భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టినా కానీ తర్వాత చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపించ లేక పోయాయి. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో చేసిన నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా భారీగానే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా కానీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన ఆ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేక పోయింది. సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 9.81 కోట్లు మాత్రమే వసూల్ చేసి డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ కూడా ఆలస్యం అవ్వగా…
టెలివిజన్ లో టెలికాస్ట్ కూడా ఆలస్యం అయింది. జీ తెలుగు లో సినిమా ఫస్ట్ టైం రీసెంట్ గా టెలికాస్ట్ అవ్వగా ఇక్కడ ఫస్ట్ టైం టి.ఆర్.పి రేటింగ్ బిలో యావరేజ్ అనిపించే విధంగా సొంతం చేసుకుంది ఈ సినిమా. మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా కి ….
4.84 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది, కొన్ని సినిమాలతో పోల్చితే ఇది డీసెంట్ రేటింగ్ అని చెప్పాలి కానీ సినిమాను జీ తెలుగు వాళ్ళు భారీ రేటుకే శాటిలైట్ రైట్స్ ను కొన్నారు, ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ తో పాటు ఇప్పుడు టెలివిజన్ లో కూడా నిరాశ పరిచింది అని చెప్పాలి.