Home న్యూస్ మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న బలగం…కలెక్షన్స్ కూడా పెరిగాయిగా!

మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న బలగం…కలెక్షన్స్ కూడా పెరిగాయిగా!

0

అప్పుడప్పుడు చడీచప్పుడు లేకుండా రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు ఆడియన్స్ ను అలరించడంలో సఫలం అవుతూ ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన బలగం అనే చిన్న సినిమా…..ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో ఒక పల్లెటూరిలో 3 రోజుల్లో పెళ్లి అవుతుంది అనుకున్న హీరో ఇంట్లో తాతయ్య చనిపోవడం తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్న కాన్సెప్ట్ తో…

తెరకెక్కి హార్ట్ టచింగ్ స్టోరీతో మెప్పించిన ఈ సినిమా కొంచం స్లోగా ఉన్నప్పటికీ కూడా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు మెప్పించడం, లైట్ కామెడీ కూడా బాగుండటంతో సినిమా చూసి బయటికి వచ్చే ఆడియన్స్ అబ్బ ఓ మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేసిందని చెప్పాలి…

చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా నైజాంలో కొంచం బెటర్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకోగా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 25 లక్షల దాకా షేర్ ని 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజు కి వచ్చే సరికి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వగా….

రెండో రోజు నైజాం నుండే ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. మొత్తం మీద రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల రేంజ్ లో షేర్ ని 80 లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 2 రోజుల్లో సినిమా60 లక్షల రేంజ్ లో షేర్ ని 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. టాక్ బాగుండటంతో ఇలానే పరుగును సూపర్బ్ గా కొనసాగించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here