యూత్ స్టార్ నితిన్ నభా నటేష్ మరియు తమన్నా ల కాంబినేషన్ లో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందిన సినిమా మాస్ట్రో… ఒరిజినల్ వర్షన్ సైలెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక్కడ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే టాలెంటెడ్ పియానిస్ట్ అయిన హీరో గుడ్డివాడిలా నటిస్తూ ఉంటాడు… అనుకోకుండా ఒక మర్డర్ ఇంసిడెంట్ లో తను ప్రత్యక్ష సాక్షి అవుతాడు, ఆ ఇంసిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది… ఫైనల్ గా ఆ ఇంసిడెంట్ నుండి బయట పడ్డాడా లేదా అన్నది…..
సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఒరిజినల్ లో ఉన్నది ఉన్నట్లు ఆల్ మోస్ట్ అన్ని సీన్స్ ని అలానే దించారు, కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేసినా అది ఒరిజినల్ అంత ఎఫెక్టివ్ గా ఏమి లేదు… కానీ నితిన్ మట్టుకు తన రోల్ కి 100% ఎఫెక్ట్స్ పెట్టాడు…
తన రోల్ లో అద్బుతంగా నటించాడు, నభా నటేష్ జస్ట్ ఓకే అనిపించగా తమన్నా విలనిజం తబు రేంజ్ లో అయితే లేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ అన్నీ కూడా ఉన్నంతలో బాగానే నటించారు, సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉండగా డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉండగా….
ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెప్పించాయి, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మేర్ల పాక గాంధీ ఒరిజినల్ ని యాసిటీస్ దింపినా అందులో ఉన్న ఫీల్ ని రీ క్రియేట్ చేయలేక పోయాడు… కానీ ఇదంతా ఒరిజినల్ చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి సినిమా కచ్చితంగా థ్రిల్ కి గురి చేస్తుంది కానీ కొంచం స్లో నరేషన్ వలన కొంచం బోర్ అనిపిస్తుంది కానీ మొత్తం మీద…
సినిమా కంప్లీట్ అయ్యాక పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది ఈ సినిమా. ఒరిజినల్ తో పోల్చితే చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేసినా రీమేక్ కాబట్టి కచ్చితంగా ఒరిజినల్ తో పోల్చి చూసినప్పుడు సినిమా యావరేజ్ లెవల్ లో మెప్పించింది అనిపిస్తుంది.. ఒరిజినల్ చూడని వాళ్ళకి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో ఉందనిపిస్తుంది ఈ సినిమా…
నితిన్ పెర్ఫార్మెన్స్ కోసం ఈజీగా ఒకసారి చూసేయోచ్చు… ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీస్ టాలీవుడ్ కి కొత్తే… థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళో తెలియదు కానీ ఇలా డిజిటల్ లో చూసే టైం లో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు… ఫైనల్ గా చెప్పాలి అంటే సినిమా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉందని చెప్పాలి… ఒరిజినల్ చూడని వాళ్ళకి కచ్చితంగా నచ్చే మూవీ ఇది.