Home TRP రేటింగ్ బిగ్ బాస్ తెలుగు 5 ఫస్ట్ వీక్ TRP…కుమ్మింది!!

బిగ్ బాస్ తెలుగు 5 ఫస్ట్ వీక్ TRP…కుమ్మింది!!

1149
0

ప్రతీ ఇయర్ అలరించే బిగ్ బాస్ లో 5 వ సీజన్ రీసెంట్ గా మొదలు అయింది, మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మూడు, నాలుగు సీజన్ లు హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున 5 వ సీజన్ ను కూడా హోస్ట్ చేస్తూ ఉండగా ఈ సీజన్ మొదటి వారానికి గాను సాధించిన రేటింగ్ వచ్చేసింది. లాంచ్ ఎపిసోడ్ కి 15.7 రేటింగ్ ఓవరాల్ గా దక్కగా….

HD ఛానెల్ లో చూసిన వాళ్ళ రేటింగ్ తో కలిపి 18 దాకా రేటింగ్ సొంతం అయ్యిందట. ఓవరాల్ గా చూసుకుంటే జనరల్ ఆడియన్స్ చూసిన వాటిలో రేటింగ్ చూసుకుంటే టోటల్ 5 సీజన్స్ లో 4 వ లోవేస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుంది, HD ఛానెల్ తో కలిపి చూస్తె కుమ్మింది అని చెప్పాలి.

సీజన్ 1కి 16.18 రేటింగ్ రాగా, సీజన్ 2 కి 15.05 రేటింగ్ వచ్చింది, సీజన్ 3 కి 17.9 రేటింగ్ రాగా, సీజన్ 4 కి 18.5 రేటింగ్ వచ్చింది… ఇక వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 6.67 రేటింగ్ సాధించగా, మొదటి సీజన్ లో 10.69 రేటింగ్, రెండో సీజన్ లో 3.5 రేటింగ్, 3 వ సీజన్ లో 4.66 రేటింగ్, 4 వ సీజన్ లో 7.22 రేటింగ్ వచ్చింది.. ఇక రెండో వారం నుండి రేటింగ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here