Home న్యూస్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ లేటెస్ట్ అప్ డేట్…ఇంకా ఎన్ని రోజుల షూటింగ్ బాలెన్స్ ఉందో...

రామ్ చరణ్ గేమ్ చేంజర్ లేటెస్ట్ అప్ డేట్…ఇంకా ఎన్ని రోజుల షూటింగ్ బాలెన్స్ ఉందో తెలుసా!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RRR మూవీతో నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇండియాలో క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Director Shankar) డైరెక్షన్ లో తన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) చేస్తూ ఉండగా చాలా టైంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా…

ఎప్పుడు అయిపోతుంది…ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా చాలా టైం తర్వాత సినిమా షూటింగ్ గురించిన అప్  డేట్ వచ్చేసింది…ఆ న్యూస్ ప్రకారం సినిమా ఓవరాల్ ఫైనల్ షూటింగ్ డేస్ ఇంకా 30 వరకు ఉన్నాయట. 30 వర్కింగ్ డేస్ లో సినిమా టోటల్ షూటింగ్ మొత్తం కూడా పూర్తి అవుతుందని అంటున్నారు.

అలాగే ఇందులో రామ్ చరణ్ కి సంభందించి ఎన్ని వర్కింగ్ డేస్ షూటింగ్ బాలెన్స్ ఉంది అనేది ఆసక్తి గా మారగా ఓవరాల్ గా మరో 7-8 వర్కింగ్ డేస్ లో రామ్ చరణ్ తాలుకూ టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అంటే ఇంకో 30 రోజుల్లో సినిమా పూర్తి షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది. 7-8 రోజుల్లో రామ్ చరణ్ ఈ సినిమా నుండి ఫ్రీ అవుతాడన్నమాట.

కానీ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. దీపావళి టైంలో రిలీజ్ ఉంటుందని అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఓవరాల్ గా గేమ్ చేంజర్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలకు తగ్గట్లు కనుక ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పాన్ ఇండియా సక్సెస్ రామ్ చరణ్ కి సొంతం అవుతుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here