Home న్యూస్ ఫాస్టెస్ట్ 25M…. 7 సినిమాల ఎపిక్ పోరులో కొమరం భీమ్ ఊచకోత!!

ఫాస్టెస్ట్ 25M…. 7 సినిమాల ఎపిక్ పోరులో కొమరం భీమ్ ఊచకోత!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో ఇప్పటి నుండే ఒక అంచనా కి వచ్చేలా సినిమా లో రిలీజ్ అయిన ఇంట్రో టీసర్ ల రికార్డులు తెలియజేస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్….

టాలీవుడ్ లో సరికొత్త రికార్డులతో మెంటల్ మాస్ అనిపించేలా దూసుకు పోతూ ఉండగా కొత్త పాత అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ రాఫ్ఫాడిస్తుంది. ఈ క్రమం లో రీసెంట్ గా 25 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఇంట్రో టీసర్…

సౌత్ లోనే ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ క్రమం లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి 7 నెలల టైం పట్టగా, అల వైకుంఠ పురంలో సినిమా టీసర్ కి 72 రోజుల టైం పట్టింది.

5 వ ప్లేస్ లో సాహో టీసర్ 15 రోజుల్లో ఈ మార్క్ ని అందుకోగా 4 వ ప్లేస్ లో మెర్సల్ టీసర్ 13 రోజుల్లో ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక 3 వ ప్లేస్ లో సర్కార్ టీసర్ 7 రోజుల 4 గంటల టైం లో ఈ రికార్డ్ అందుకోగా, రెండో ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు టీసర్ 6 రోజుల 23 గంటల టైం తీసుకుని రికార్డ్ సృష్టించింది.

ఇక ఇప్పుడు మొదటి ప్లేస్ లో కొమరం భీమ్ ఇంట్రో టీసర్ 6 రోజుల 12 గంటల టైం తీసుకుని ఈ రికార్డ్ ను సృష్టించి సౌత్ లో ఫాస్టెస్ట్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ గా అల్టిమేట్ రికార్డ్ తో ఊచకోత కోసి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్లలో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here