3 ఏరియాలు….49.80 కోట్లు….[మాస్]…చుక్కలు చూయిస్తున్న సూపర్ స్టార్!!

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు మీదున్నాడు, కెరీర్ లో వరుస ఫ్లాఫ్స్ తర్వాత భరత్ అనే నేను మరియు మహర్షి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన మహేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు అంటూ మాస్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఇక సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి…

మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత ఒక్కొటిగా సినిమా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ సినిమా పై హైప్ ని మరింత పెంచుతున్నారు. లిరికల్ వీడియో లు అన్ని 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైన్స్ ని అందుకున్న టాప్ 5 సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తు దూసుకు పోతున్నాయి.

Mahesh Fans on Fire... Just a Song Update - 150K Tweets Polled

ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా కొన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయింది, మహేష్ ఫామ్ లో ఉండటం, ఇది పక్కా కమర్షియల్ మూవీ అవ్వడంతో బిజినెస్ యమ జోరుగా సాగుతుంది, ఇక ఇప్పటి వరకు 3 ఏరియాల బిజినెస్ కన్ఫాం అవ్వగా 3 ఏరియాల బిజినెస్ ఆల్ మోస్ట్ 50 కోట్లు టచ్ అయింది.

పోటి లో ఇతర సినిమాలు ఉన్నా కానీ నైజాం లో 25 కోట్ల బిజినెస్, సీడెడ్ లో 10.8 కోట్ల బిజినెస్ ను, ఓవర్సీస్ లో 14 కోట్ల బిజినెస్ ని కన్ఫాం చేసుకుంది సినిమా. ఈ మూడు ఏరియాల బిజినెస్ కలిపి టోటల్ గా 49.80 కోట్లు అవ్వడం విశేషం. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ ను తేలాల్సి ఉండగా…

అన్ని ఏరియాల బిజినెస్ లెక్కలు కలిపి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 90 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ న్యూ ఇయర్ లో మొదటి వారంలో జరగబోతుంది.

Mind Block Song From Sarileru Neekevvaru Created Records in 24hrs

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE