Home TRP రేటింగ్ 16.5 కోట్లకు అమ్మితే… ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన సరిలేరు నీకెవ్వరు TRP రేటింగ్!!

16.5 కోట్లకు అమ్మితే… ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన సరిలేరు నీకెవ్వరు TRP రేటింగ్!!

0

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో పోటి లో అన్ని సినిమాల కన్నా ముందు రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని సొంతం చేసుకోగా… పోటిలో వచ్చిన…

అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో బెటర్ టాక్ ని తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా భారీ పోటి ఇస్తూ 138 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక సినిమా ఫైనల్ రన్ రీసెంట్ గా పూర్తీ కాగా సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే శాటిలైట్ రైట్స్…

భారీ రేటు కి అమ్ముడు పోయాయి. టాలీవుడ్ లీడింగ్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని రికార్డ్ లెవల్ లో 16.5 కోట్లు చెల్లించి హక్కులను దక్కించుకోగా ఉగాది కానుకగా సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమయం లో అనుకోకుండా కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ జరగగా అందరూ ఇంట్లో నే ఉండటం మరింత కలిసి వచ్చిన సినిమా కి TRP రేటింగ్ పరంగా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 23.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

బార్క్ వచ్చిన తర్వాత బాహుబలి పార్ట్ 2 ఏకంగా 22.7 TRP రేటింగ్ తో టాప్ లో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా TRP రేటింగ్ సరికొత్త సంచలన రికార్డ్ ను నమోదు చేసి చుక్కలు చూయించింది. ఈ రేంజ్ రేటింగ్ చూస్తుంటే జెమినీ టీవీ కి తొలి సారి టెలికాస్ట్ కే భారీ మొత్తం వెనక్కి వచ్చి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=T2ox8WCDxNE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here