Home TRP రేటింగ్ సాయి ధరం తేజ్ కెరీర్ బెస్ట్ TRP రేటింగ్ తో దుమ్ము లేపిన ప్రతీరోజు పండగే...

సాయి ధరం తేజ్ కెరీర్ బెస్ట్ TRP రేటింగ్ తో దుమ్ము లేపిన ప్రతీరోజు పండగే సినిమా

0

   సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా 6 ఫ్లాఫ్స్ కొట్టగా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో చిత్రలహరి సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చినా నికార్సయిన బ్లాక్ బస్టర్ వేటలో ఉన్న టైం లో ఇయర్ ఎండ్ లో మారుతి డైరెక్షన్ లో చేసిన ప్రతీ రోజూ పండగే సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని సత్తా చాటుకున్నాడు మెగా మేనల్లుడు.

ఈ సినిమా భారీ పోటి లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి ఫైనల్ రన్ లో ఏకంగా 34 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా సాయి ధరం తేజ్ కెరీర్ లో కూడా నంబర్ 1 మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది.

ఇక సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. స్టార్ మా వారు ఈ సినిమా కి మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా టెలివిజన్ టెలికాస్ట్ అయిన టైం లో ఈ సినిమా కి 15.3 TRP రేటింగ్ దక్కింది. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇది కూడా కెరీర్ బెస్ట్…

ఇది వరకు సాయి ధరం తేజ్ కెరీర్ లో సుప్రీమ్ సినిమా 14.69 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని టాప్ లో ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ప్రతీ రోజూ పండగే సినిమా 15.3 TRP రేటింగ్ ని సొంతం చెసుకుని మెగా మేనల్లుడి కెరీర్ లో నంబర్ 1 TRP రేటింగ్ అందుకున్న సినిమా గా నిలిచింది.

మొత్తం మీద ఈ సినిమా తో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లి తెరపై కూడా కెరీర్ బెస్ట్ రికార్డులను సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

https://www.youtube.com/watch?v=Ey_6fUw93Hw

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here