Home న్యూస్ గంటలో 3 మిలియన్…సూపర్ స్టార్ ఫ్యాన్స్ రాంపేజ్!!

గంటలో 3 మిలియన్…సూపర్ స్టార్ ఫ్యాన్స్ రాంపేజ్!!

0

సోషల్ మీడియా లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సెన్సేషనల్ జోరు చూపుతూ దూసుకు పోతున్నారు. రీసెంట్ టైం లో మన టాలీవుడ్ హీరోల అన్ని ట్రెండ్స్ కూడా ఓ రేంజ్ లో ఒకటి కి మించి ఒకటి రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పొగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మహేష్ బర్త్ డే కి ఇంకా టైం ఉన్నా అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్ తో…

కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నారు. కాగా ట్రెండ్ మొదలైన 17 నిమిషాల్లోనే 1 మిలియన్ ట్వీట్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేస్తూ సెకెండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ ని అందుకున్న హాష్ టాగ్ రికార్డ్ ను సొంతం చేసుకున్న మహేష్ ఫ్యాన్స్..

ఒక గంట వ్యవధిలో మరో సారి 3 మిలియన్స్ రేంజ్ లో ట్వీట్స్ ని పోల్ చేసి సంచలనం సృష్టించారు… దాంతో మరో సారి సెకెండ్ ఫాస్టెస్ట్ 3 మిలియన్ రికార్డ్ ను సొంతం చేసుకోగా మొదటి ప్లేస్ లో గంటలో పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ లో 4.12 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యాయి.

ఒకసారి గంటలో అత్యధిక ట్వీట్స్ పోల్ అయిన టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే..
👉#AdvanceHBDPawanKalyan : 4.12M
👉#MaheshBabuBdayCDP : 3M~****
👉#HappyBirthdayNTR : 2.9M~
👉#8YrsOfGabbarSinghHysteria : 1.8m~
👉#HappyBirthdayPawanKalyan : 1.57M~
ఇవి గంటలో అత్యధిక ట్వీట్స్ ని అందుకున్న టాప్ ట్రెండ్స్. సరిగ్గా 60 నిమిషాల్లో మహేష్ అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్ ఎంత వరకు ట్వీట్స్ వచ్చాయి అన్నది…

క్లియర్ నంబర్ రివీల్ కాలేదు కానీ…ఓవరాల్ గా 3 మిలియన్స్ కి అటూ ఇటూగా ట్వీట్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓవరాల్ గా అడ్వాన్స్ CDP బర్త్ డే ట్రెండ్స్ రికార్డులు మరి కొద్ది సేపట్లో బ్రేక్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక 24 గంటల్లో మహేష్ ఫ్యాన్స్ కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here