Home న్యూస్ 250 కోట్ల సినిమా…ఇక ఔట్ అనుకుంటే ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతున్నాయిగా!!

250 కోట్ల సినిమా…ఇక ఔట్ అనుకుంటే ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతున్నాయిగా!!

0

ఆల్ మోస్ట్ 9 సార్లు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Degvn) నటించిన మైదాన్(Maidaan Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రంజాన్ కానుకగా రిలీజ్ అయ్యింది. ఆల్ మోస్ట్ 250 కోట్ల రేంజ్ మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో…

జనాలలో సినిమా మీద ఆసక్తి తగ్గిపోగా రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించ లేక పోయింది…మొదటి వారంలో 28 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఇక ఔట్ అనుకున్నారు అందరూ…. కానీ సినిమా ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర…

పాజిటివ్ టాక్ పవర్ తో రెండో వీక్ లో 11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక మూడో వీకెండ్ లో లిమిటెడ్ థియేటర్స్ లోనే సినిమా 5 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకుంది…చాలా వరకు సినిమాలు ఏమాత్రం తేడా కొట్టినా తర్వాత స్లో అయిపోతాయి…. కానీ మైదాన్ మూవీ కొంచం పాజిటివ్ టాక్ హెల్ప్ అవ్వడంతో…

మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా ఇండియాలో 44 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 59 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కానీ ఇప్పటికీ కూడా సినిమా బడ్జెట్ లెక్కలో చూసుకుంటే వరల్డ్ వైడ్ వర్త్ షేర్ లెక్క 27 కోట్ల రేంజ్ లో కూడా లేవనే చెప్పాలి…

ఓవరాల్ గా బడ్జెట్ పరంగా భారీ డిసాస్టర్ గా నిలిచిన ఈ సినిమా పెద్దగా సినిమాలు ఏమి లేక పోవడంతో లాంగ్ రన్ లో పాజిటివ్ టాక్ పవర్ తో కొద్ది వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here