Home న్యూస్ 250 కోట్ల సినిమా…ఔట్ అనుకున్నారు….ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి…కానీ!!

250 కోట్ల సినిమా…ఔట్ అనుకున్నారు….ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎప్పుడు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తుందో ఎవరూ ఊహించలేరు….ఆల్ మోస్ట్ 9 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఆడియన్స్ లో ఆసక్తి చాలా వరకు తగ్గిపోయిన అజయ్ దేవగన్(Ajay Degvn) నటించిన మైదాన్(Maidaan Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మంచి రివ్యూలు సొంతం అయ్యాయి..

కానీ జనాలలో అసలు ఏమాత్రం ఆసక్తి లేని ఈ సినిమా రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరు చూపించ లేక పోయింది 2 వారాల్లో 39 కోట్లు మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 250 కోట్ల రేంజ్ లో ఉండగా కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి…

ఇలా రెండో వారంలో డ్రాప్ అయిన సినిమాలు తర్వాత ఇక ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేస్తాయి. కానీ మైదాన్ మూవీ మాత్రం రెండు వారాల తర్వాత రెండు వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ 13 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది….నాలుగో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…

మొత్తం మీద 4 వారాల్లో ఇండియాలో 52 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇండియా గ్రాస్ 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 7.5 కోట్ల గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 71.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….మొత్తం మీద సినిమా నాలుగో వారం లో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో ఇప్పటికీ….

ఎంతో కొంత గ్రోత్ ని చూపిస్తూ ఉండటం కొంత విశేషం అయినా కూడా పెట్టిన బడ్జెట్ కి ఇప్పటి వరకు వర్త్ షేర్ 35 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేదు…దాంతో ఎంతో కొంత జోరు ఇప్పుడు చూపిస్తూ ఉన్నా కూడా సినిమా బడ్జెట్ దృశ్యా బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ మూవీస్ లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here