అక్కినేని నాగ చైతన్య మరియు సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ బరిలో మరి కొన్ని గంటల్లో దిగుతుంది, సినిమా పై మంచి బజ్ రిలీజ్ కి ముందే ఏర్పడటం తో అన్ని వైపులా ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ తో రిలీజ్ అవుతున్న మజిలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో కూడా కుమ్మేసింది, ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు…
35% వరకు ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని సాధించిన ఈ సినిమా రిలీజ్ మొదటి షో సమయానికి 45% ని టచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ ఎలెక్షన్ మూవ్ మెంట్ అవ్వడం డానికి తోడూ IPL ఎఫెక్ట్ కూడా పొంచి ఉండటం తో…
సినిమా కలెక్షన్స్ పై అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది, ఒక వేల ఆఫ్ లైన్ బుకింగ్స్ అండ్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె మినిమమ్ లో మినిమమ్ 4.5 కోట్ల రేంజ్ షేర్ మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఒకవేళ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కి…
మించి ఉంటే ఈ లెక్క కచ్చితంగా దాటుతుంది అని చెప్పొచ్చు, నాగచైతన్య రీసెంట్ మూవీస్ లో శైలజా రెడ్డి అల్లుడు 6.9 కోట్ల రేంజ్ షేర్ ని మొదటి రోజు అందుకుంది, కానీ అప్పుడు పైన చెప్పిన ఎఫెక్ట్స్ ఏవి లేవు, కానీ ఇప్పుడు ఉండటం తో సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి…
మొదటి రోజు ఇబ్బందులను దాటుకుని పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే నే కలెక్షన్స్ పరంగా జోరు చూపే అవకాశం ఉంది, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మజిలీ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి జోరు చూపుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.