నాగ చైతన్య మజిలీ బాక్స్ ఆఫీస్ మాస్ ఊచకోత కొనసాగుతుంది, సినిమా 8 రోజుల్లోనే నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 గా నిలవగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 29 కోట్లకు పైగా షేర్ ని ఇప్పటికే అందుకోగా సినిమా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు బాక్స్ ఆఫీస్…
డ్రాప్స్ ఓవరాల్ గా కేవలం 35% వరకు మాత్రమె ఉండటం తో సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు, దాంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ కలెక్షన్స్ తో రోజుని ముగించనున్న మజిలీ ఈవినింగ్ షోల కి IPL మ్యాచుల ఎఫెక్ట్ పడకుండా ఆఫ్ లైన్…
టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే మరోసారి 75 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు. కొన్ని ఏరియాల్లో 8 వ రోజు కన్నా బెటర్ గా హోల్డ్ చేసింది ఈ సినిమా… దాంతో లెక్క మించే అవకాశం కూడా ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా 9 వ రోజు సాధించే కలెక్షన్స్ మరోసారి సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది, ఇక 10 వ రోజు కూడా ఆదివారం అవ్వడం తో రెండో వీకెండ్ ని అత్యంత ఘనంగా ముగించి బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల వేట ని కొనసాగించ నుంది మజిలీ సినిమా.
ఇక 9 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారింది, సినిమా 30 కోట్ల షేర్ మార్క్ ని 9 వ రోజు అందుకుంటుందా లేదా అన్నది అఫీషియల్ లెక్కల్లో తేలనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.