వరుస విజయాలతో దూసుకు పోతున్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో లాక్ డౌన్ టైం లో పక్కా కమర్షియల్ మూవీ కి గ్యాప్ ఇచ్చి అతి తక్కువ టైం లో షూటింగ్ ను పూర్తీ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే డిజిటల్ రిలీజ్ వద్దూ అనుకుని ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో దీపావళి టైం లో బరిలోకి దిగిన సినిమా మంచి రోజులు వచ్చాయి. సినిమా కి ముందు బిజినెస్…
జరిగినట్లు వార్తలు వచ్చినా కానీ తర్వాత మేకర్స్ సినిమా కి ఎలాంటి బిజినెస్ జరగలేదని, నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కంప్లీట్ గా ప్రాఫిట్ జోన్ కి రావడంతో సినిమాను కంప్లీట్ గా ఓన్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చామని కన్ఫాం చేశారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
జస్ట్ ఓకే అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకోగా ఆడియన్స్ ఇతర మారుతి మూవీస్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే లభించలేదు కానీ సినిమా టాక్ ఎలా ఉన్నా ఆల్ రెడీ మేకర్స్ ప్రాఫిట్స్ లోనే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చింది మొత్తం వాళ్ళకి లాభమే అని చెప్పాలి.
టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.10Cr
👉Ceeded: 50L
👉UA: 36L
👉East: 29L
👉West: 20L
👉Guntur: 29L
👉Krishna: 23L
👉Nellore: 18L
AP-TG Total:- 3.15CR(5.40CR~ Gross)
Ka+ROI: 12L
OS – 20L
Total WW: 3.47CR(6CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్.
సినిమాకి ముందు ట్రేడ్ లో వినిపించిన బిజినెస్ నిజం అయ్యి ఉంటే సినిమా భారీ నష్టాలనే అందుకునేది కానీ, మేకర్స్ ఓన్ రిలీజ్ అని క్లియర్ గా చెప్పడంతో సినిమా బిజినెస్ ఏమి లేనప్పుడు టార్గెట్ కూడా ఉండదు కాబట్టి టోటల్ గా సినిమా మేకర్స్ కి ప్రాఫిటబుల్ మూవీనే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అటు హిట్ అనిపించుకోదు, ఇటు ఫ్లాఫ్ కూడా అనిపించుకోదు అని చెప్పాలి.