Home న్యూస్ చిన్న సినిమా…సెన్సేషనల్ బిజినెస్ తో మాస్ రచ్చ!

చిన్న సినిమా…సెన్సేషనల్ బిజినెస్ తో మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర RX100 సినిమాతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఆ తర్వాత మహా సముద్రం సినిమాతో మెప్పిస్తాడు అనుకున్నా ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత మళ్ళీ తన స్టైల్ లోనే ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ ను తీసుకుని మొదటి సినిమా హీరోయిన్ అయిన…

పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో మంగళవారం(Mangalavaaram Movie) ని తీయగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ లో ఈ సినిమా మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అని చెప్పాలి. విలేజ్ బ్యాగ్ డ్రాప్ లో కొంచం రా రస్టిక్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా…

ట్రైలర్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ జోరుగా సాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో ఆల్ రెడీ సినిమా బిజినెస్ ఊహించని రేటుకి ఫైనల్ అయినట్లు తెలుస్తుంది ఇప్పుడు… సినిమా కోసం ఏకంగా ఇక్కడ…

7.20 కోట్ల దాకా రేటు చెల్లించి హక్కులను తీసుకున్నారట. ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీ, అందునా పెద్దగా నోటబుల్ స్టార్ కాస్ట్ కూడా లేదు, డైరెక్టర్ ఫ్లాఫ్ లో ఉన్నాడు, అయినా కూడా ఈ సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ లలో ఈ రేంజ్ లో…

బిజినెస్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ లు కూడా త్వరలోనే పూర్తి కాబోతూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా మంచి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here