క్రిష్ అండ్ కంగనా ల డైరెక్షన్ లో వచ్చిన హిస్టారికల్ మూవీ మణికర్ణికా బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ డే వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది, కాగా సినిమా కి అన్ని చోట్లా మంచి టాక్ లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేసింది, కానీ రెండో రోజు రిపబ్లిక్ డే హాలిడే ఉండటం తో సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని…
ఇండియా వైడ్ గా సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ గా మొదటి రోజు ఇండియా లో 8.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రెండో రోజు అల్టిమేట్ గ్రోత్ ని సాధించి రిపబ్లిక్ డే హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసి ఏకంగా 18.10 కోట్ల…
నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, దాంతో 2 రోజుల్లో టోటల్ గా 26.85 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మూడో రోజు కూడా 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సినిమా మొత్తం మీద సాధించిన ఈ కలెక్షన్స్ హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషలు కలిపి వచ్చినట్లు సమాచారం. టోటల్ గా ఇండియా లో ఈ సినిమా అన్ని భాషలలో కలిపి సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు గా 70 కోట్ల రేంజ్ లో ఉండగా…
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి టోటల్ ఇండియా లో 120 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది అని సమాచారం, వీకెండ్ కలెక్షన్స్ 45 కోట్లకు పైగా కన్ఫాం అవ్వడం తో సోమవారం హోల్డ్ చేస్తే సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.