Home న్యూస్ మన్మథుడు 2 ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!

మన్మథుడు 2 ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

       కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ ల లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు సుమారు 1000 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది, ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని రీసెంట్ గా పూర్తీ చేసుకున్న సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే లైఫ్ లో పెళ్లి కి దూరంగా….

ఉండే హీరో నాగార్జున ని ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి చేసుకోమని బలవంతపెట్టడంతో ఒక నాటకం ఆడతాడు, రకుల్ తో ఓ కాంట్రాక్ట్ చేసుకుని లవర్ గా నటించమని ఒప్పందం చేసుకుంటాడు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అన్నది మాత్రం ఓవరాల్ స్టొరీ లైన్ అని అంటున్నారు.

కథ పాయింట్ చిన్నదే అయినా లెంత్ ఎక్కువగానే తీశాడని అంటున్నారు, అయినా కానీ ఫస్టాఫ్ మొత్తం క్యారక్టర్ల ఇంట్రో కి తర్వాత అలరించే సన్నివేశాల తో కామెడీ సీన్స్ ఫస్టాఫ్ వరకు సినిమా అంచనాలను అందుకుంటూ మంచి ఎపిసోడ్ తో ఇంటర్వెల్ పడుతుందని అంటున్నారు.ఇక సెకెండ్ ఆఫ్ పై మంచి అంచనాలు పెరగగా సినిమా అక్కడ లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుందని…

అక్కడక్కడా కథ మొత్తం సాగదీసినట్లు అనిపిస్తుందని అంటున్నారు, కానీ వెన్నెల కిషోర్ రావ్ రమేష్ ల కామెడీ, సినిమాను చివరి వరకు లాగుతూ మెయిన్ పిల్లర్స్ గా నిలిచారని, కింగ్ నాగార్జున పెర్ఫార్మెన్స్ పరంగా కుమ్మేయగా లుక్స్ పరంగా చాలా యంగ్ గా అనిపించాడని అంటున్నారు.

రకుల్ రోల్ కి కూడా మంచి ప్రాధాన్యత ఉండటం తో రకుల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు పరిది మేర నటించాయి అంటున్నారు, సంగీతం పెద్దగా వినడానికి యావరేజ్ గా ఉన్నా విజువల్ గా బాగుందని అంటున్నారు, ఎడిటింగ్ మరింతగా చేసి ఉంటె బాగుండేదని ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ విషయం లో కొన్ని సీన్స్ తగ్గించాల్సిందని అంటున్నారు.

ఇక డైరెక్షన్ పరంగా రాహుల్ రవీంద్రన్ ఉన్నంతలో బాగానే తీశాడని, సెకెండ్ ఆఫ్ పై మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఉంటె సినిమా మరింత ఎంటర్ టైనింగ్ తో ఆకట్టుకునేదని అంటున్నారు. మొత్తం మీద సినిమా వెన్నెల కిషోర్-రావ్ రమేష్ ల కామెడీ కోసం… నాగార్జున రకుల్ ల పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చని అంటున్నారు.

ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమా కి ఫైనల్ గా వినిపిస్తున్న టాక్ ఎబో యావరేజ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ షోల కి ఇక్కడ సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.

ఓవర్సీస్ ఆడియన్స్ రేంజ్ లోనే ఇక్కడ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉండి, మరి రెగ్యులర్ ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here