Home న్యూస్ 2 గంటల్లో 1.5 మిలియన్ ట్వీట్స్..రికార్డ్ ముక్క మిగలదు అంటున్న ఫ్యాన్స్!!

2 గంటల్లో 1.5 మిలియన్ ట్వీట్స్..రికార్డ్ ముక్క మిగలదు అంటున్న ఫ్యాన్స్!!

395
0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియా లో మొదలు అయ్యాయి, 9 న పుట్టినరోజు కాగా ఫ్యాన్స్ ఆగస్ట్ 8 సాయంత్రం 6 గంటల నుండే సోషల్ మీడియా లో భారీ ఎత్తున ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు, కాగా ఈ క్రమం లో 65 నిమిషాల లోపే 1 మిలియన్ ట్వీట్స్ ని పూర్తి చేసుకుని సెన్సేషనల్ ట్రెండ్ తో దూసుకు పోతున్నారు ఫ్యాన్స్… ఇక 2 గంటలు ముగిసాకా…

1.5 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ ని కంప్లీట్ చేసిన ఫ్యాన్స్ మొత్తం మీద 24 గంటలు ముగిసే సరికి రికార్డ్ ముక్క కూడా మిగలదు అంటూ చలరేగి పోతున్నారు. సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ లాస్ట్ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పేరిట ఉంది.

24 గంటల్లో ఏకంగా 7.4 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సత్తా చాటుకుని సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయాలి అని మహేష్ ఫ్యాన్స్ చూస్తున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు కానుకగా 9 న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సరిలేరు నీకెవ్వరు అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here