Home న్యూస్ మరక్కార్ రివ్యూ….ఏంటి సామి ఇది!!

మరక్కార్ రివ్యూ….ఏంటి సామి ఇది!!

0

మలయాళ ఇండస్ట్రీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమాలలో మరక్కార్ అరేబియా సముద్ర సింహం సినిమా ముందు నిలిచే సినిమా… ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ హిస్టారికల్ మూవీ అనేక సార్లు పోస్ట్ పోన్ అయ్యి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి కోట్ల ఆఫర్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోగా తెలుగు కూడా డబ్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ సినిమా…

సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి దోచుకునే రోజుల్లో హీరో ఫ్యామిలీని చంపుతారు. హీరో అడవుల్లోకి పారిపోయి ఒక సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుని లేని వాళ్ళకి ఇస్తాడు. బ్రిటిష్ వాళ్ళు మరక్కార్ ని పట్టుకోవడానికి…

ఒక సైన్యాన్ని పంపుతారు. మరి వాళ్ళపై హీరో పోరాడి గెలిచాడా లేదా అన్నది అసలు కథ… ఇలాంటి స్టొరీ పాయింట్ పై ఇప్పటికే అనేక సినిమాలు రాగా సేమ్ కథతో వచ్చిన మరక్కార్ సినిమా ఏ దశలో కూడా ఆకట్టుకునేలా సాగలేదు. సీన్ బై సీన్ చాలా నెమ్మదిగా సహనానికి పరీక్ష పెడుతూ…

బోర్ కొట్టిస్తుంది. భారీ సెట్టింగ్ లు, గ్రాఫిక్స్ అండ్ గ్రాండియర్ ఉన్నప్పటికీ అసలు కథే లేక పోవడంతో అవేవి కూడా ఇంప్రెస్ చేయలేక పోయాయి. కొన్ని ఫైట్స్ కూడా ఆకట్టుకున్నా కానీ ఆ లెంత్ అండ్ మలయాళ ఫ్లేవర్, స్లో నరేషన్ లాంటివి చాలా ఓపికతో సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి తప్ప నార్మల్ ఆడియన్స్ కి ఎక్కే అవకాశం తక్కువే…

ఉన్నంతలో మోహన్ లాల్ సినిమా కోసం ఎంత కష్టపడినా కానీ అసలు కథలోనే ఏమి లేకపోవడంతో ఆ కష్టం వృదా అయ్యింది. భారీ తారాగణం ఉన్నప్పటికీ అవేవి కూడా 3 గంటలు కూర్చోపెట్టలేకపోయాయి. మొత్తం మీద మీకు చాలా ఓపిక ఉంటే అతి కష్టం మీద సినిమాను ముగించవచ్చు…. మొత్తం మీద సినిమా హిస్టారికల్ స్లో పేస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పర్వాలేదు అనిపించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here