Home న్యూస్ మార్చ్ 1st వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్….దారుణం సామి ఇదీ!!

మార్చ్ 1st వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్….దారుణం సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం లేదు, ఫిబ్రవరి మార్చ్ నెలలను అన్ సీజన్ గా భావిస్తారు…కానీ ఈ నెలలలో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సినిమాలు చాలానే ఉన్నాయి ఇది వరకు, కానీ ఈ ఇయర్ లో ఫిబ్రవరి లో ఈగల్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మరియు ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు…

మిగిలిన సినిమాల కంటే బెటర్ టాక్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సేఫ్ అయ్యింది, మిగిలిన సినిమాలు హిట్ గీతని దాటలేదు..ఇక మార్చ్ ఫస్ట్ వీకెండ్ లో మరిన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వెన్నెల కిషోర్ చారి111 మరియు భూతద్దం భాస్కర నారాయణ అనే చిన్న సినిమా రిలీజ్ అయింది.

AP-TG 9th Day Highest Share Movies

వరుణ్ తేజ్ మూవీ మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ రావడంతో తర్వాత వీకెండ్ లో మిగిలిన సినిమాలతో పోల్చితే కొంచం బెటర్ అనిపించుకున్నా ఓవరాల్ గా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ని అందుకుంది. మిగిలిన సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా లభించలేదు…ఈ వీకెండ్ మూవీస్ లో….భూతద్దం భాస్కర నారాయణ సినిమా…

టాక్ పరంగా కొంచం బెటర్ గా ఉన్నా కూడా ప్రమోషన్స్ లేక పోవడం, స్టార్ వాల్యూ లేక పోవడంతో ఇంపాక్ట్ ఏమి లేదు, దాంతో టాలీవుడ్ లో ఈ వీకెండ్ డిసాస్టరస్ గా నిలిచింది అని చెప్పొచ్చు… ఆల్ మోస్ట్ నెల రోజులుగా టాలీవుడ్ కి హిట్ అయతే దక్కలేదు అనే చెప్పాలి. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా…

హిట్స్ లేవు కానీ బాలీవుడ్ లో మినిమమ్ కలెక్షన్స్ అయినా వస్తూ ఉండగా ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రం బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతుంది. ఇక టాలీవుడ్ మంచి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండగా వచ్చే వారంలో రిలీజ్ అయ్యే సినిమాలతో తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here