Home న్యూస్ అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు…సమరసింహారెడ్డి రీ రిలీజ్ పరిస్థితి ఏంటంటే!!

అన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు…సమరసింహారెడ్డి రీ రిలీజ్ పరిస్థితి ఏంటంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ఓల్డ్ మూవీ సమర సింహా రెడ్డి(Samara Simha Reddy Re Release Collections) సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న నేపధ్యంలో…

భారీగా రీ రిలీజ్ ను ప్లాన్ చేశారు… ఆల్ మోస్ట్ 400 స్క్రీన్స్ లో సినిమాను రీ రిలీజ్ చేయగా సీడెడ్ ఏరియాలో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న సినిమా మిగిలిన చోట్ల కొన్ని సెలెక్టివ్ ప్లేసులలో పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకునే వసూళ్ళని సినిమా అందుకోలేక పోయింది…

ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ గ్రాస్ 15 లక్షల రేంజ్ లో ఉందని అంచనా…. సినిమా రిలీజ్ అయిన రేంజ్ కి ఇవి చాలా నిరాశ పరిచే ఓపెనింగ్స్ అనే చెప్పాలి. అన్ సీజన్ ఇంపాక్ట్ గట్టిగానే ఉన్న నేపధ్యంలో కొత్త సినిమాలకే కలెక్షన్స్ రావడం లేదు, అలాంటిది రీ రిలీజ్ లకు సాలిడ్ రెస్పాన్స్ ఎక్స్ పెర్ట్ చేయడం కష్టమే…

కానీ భారీ రిలీజ్ ను ప్లాన్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా జోరు చూపిస్తుంది అనుకున్నా ఈ సమర సింహా రెడ్డి రీ రిలీజ్ పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. ఈ సినిమాతో ఇతర రీ రిలీజ్ మూవీస్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి. ఇక కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు సందడి చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here