Home న్యూస్ అక్కడా డిసాస్టరే…ఇక్కడా డిసాస్టరే….పాపం!!

అక్కడా డిసాస్టరే…ఇక్కడా డిసాస్టరే….పాపం!!

0

భారీ హైప్ అంటూ ఏమి లేకున్నా కానీ రిలీజ్ టైం లో అనుకోకుండా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిన సినిమాలలో సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఈ ఇయర్ ముందు నిలిచే సినిమా అని చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఒక్క సాంగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ చేయించాం అంటూ…

చెప్పిన డైలాగ్స్ సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ గా మారాయి… సినిమా పై జనాల్లో అసలు ఏమాత్రం ఆసక్తి లేక పోవడంతో బుకింగ్స్ ఏమి జరగక పోవడంతో ఆ విషయాలు కూడా ట్రోల్ స్టఫ్ గా మారిపోగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలను అందుకోక పోవడంతో..

బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపెట్టలేక థియేటర్స్ రెంట్స్ కూడా కట్టే ఓపెనింగ్స్ ని అందుకోలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత డిజిటల్ రిలీజ్ కొంత ఆలస్యం అయ్యి రీసెంట్ గా సినిమా అమెజాన్ ప్రైమ్ లో…

డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా అసలు ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్టలేక పోతుంది సినిమా…. ప్రైమ్ వీడియో లో తెలుగు మూవీస్ కేటగిరీలో కొత్త మూవీస్ ఏవి వచ్చినా కొన్ని ట్రెండ్ అవుతూ ఉంటాయి, కానీ సన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా వ్యూవర్ షిప్ చాలా తక్కువగానే సొంతం చేసుకుంది అని చెప్పాలి. పోటిలో ఇతర సినిమాలు కూడా…

డిజిటల్ లో రిలీజ్ అవ్వడం లాంటివి ఈ సినిమా పై ఇంపాక్ట్ చూపగా మొత్తం మీద థియేటర్స్ లోనే కాదు ఇటు డిజిటల్ లో కూడా సినిమా తీవ్రంగానే నిరాశ పరిచింది అని అంటున్నారు, ఇక త్వరలోనే టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉండగా అక్కడ సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here