Home న్యూస్ చిన్న సినిమా…స్పెషల్ షోలు ఫుల్స్….ఇదేం రచ్చ సామి!

చిన్న సినిమా…స్పెషల్ షోలు ఫుల్స్….ఇదేం రచ్చ సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాల్లో మేమ్ ఫేమస్ సినిమా కూడా ఒకటి, చిన్న సినిమానే అయినా కూడా యూనిక్ ప్రమోషన్స్ తో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ తో రిలీజ్ కానుండగా టికెట్ రేటు 99 మాత్రమే కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో పెట్టడంతో…

జనాలు బాగానే అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాలి ఇప్పుడు. దాంతో హైదరాబాదులో సినిమా స్పెషల్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడగా చాలా సెంటర్స్ లో టికెట్స్ 70-80% వరకు ఆక్యుపెన్సీని షోలు ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ముందే సొంతం చేసుకోగా షోలు పడే టైంకి…

అన్ని చోట్లా సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది. సినిమా కి ఆంధ్రలో కూడా రెస్పాన్స్ బాగానే ఉండగా ఈ స్పెషల్ షోలకు సినిమా కనుక మంచి టాక్ ను సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా మంచి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా కూడా మంచి ప్రమోషన్స్ జనాలలో సినిమా పై మంచి రీచ్ నే సొంతం అయ్యేలా చేసింది. ఎటొచ్చి ఇక టాక్ కూడా పాజిటివ్ గా ఉంటే ఈ ప్రమోషన్స్ హెల్ప్ తో టాలీవుడ్ కి సినిమా మరో హిట్ మూవీ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here